: ప్రయాణికులు ఫుల్...పైలట్, సిబ్బంది నిల్...'ఎయిరిండియా' షాక్


ఎయిరిండియా విమానాల మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. సెలబ్రిటీల గురించి ఎదురు చూస్తారని, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించరని, సేవలు ఇతర విమాన సర్వీసులతో పోలిస్తే నాసిరకమని చెబుతుంటారు. ఈ ఆరోపణలు నిజం చేసే ఘటన ఢిల్లీ నుంచి భువనేశ్వర్ ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎదురైంది. భువనేశ్వర్ లో బానిసత్వంపై జరుగుతున్న సదస్సులో పాల్గొనేందుకు ఎన్ హెచ్ఆర్సీ బృందం ఎయిరిండియా విమానం ఎక్కింది. విమానం బయల్దేరుతుందని భావించి అంతా సీట్ బెల్టులు కూడా పెట్టుకున్నారు. గంట గడిచింది కానీ విమానం బయల్దేరలేదు. దీంతో ఏమైందా? అని విచారించగా పైలట్, సిబ్బంది రాలేదని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడంతో రెండు గంటల తరువాత వేరే విమాన సిబ్బందిని పంపి విమానాన్ని పంపించారు. దీనిపై ఎయిరిండియా పెద్దగా స్పందించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News