: తేనెటీగల దాడి...శవాన్ని వదిలి పరుగులు తీసిన జనం!


ఒక మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా తేనెటీగలు దాడి చేయడంతో మృతుడి కుటుంబీకులు, బంధుమిత్రులు పరుగులు తీసిన సంఘటన కర్నాటక రాష్ట్రంలోని కోలార్ లో నిన్న జరిగింది. ఈ దాడిలో సుమారు పదిమంది వరకు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళుతుండగా ఒక చెట్టు పై నుంచి ఒక్కసారిగా తేనెటీగలు వీరిపైకి దూసుకొచ్చాయి. దీంతో మృతదేహాం వెంట ఉన్న సుమారు 15 మంది దానిని అక్కడే వదిలిపెట్టి పరుగులు తీశారు. మూడు గంటలపాటు వేచి చూసినప్పటికి తేనెటీగలు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో పొగబెట్టి వాటిని తరిమి కొట్టాల్సి వచ్చిందని మృతుడి కుటుంబీకుల్లో ఒకరు చెప్పారు. కాగా, అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భాల్లో తేనెటీగలు ఈవిధంగా దాడి చేయడం గతంలో చాలా సార్లు జరిగింది.

  • Loading...

More Telugu News