: ఆ నొప్పి ఎలా ఉంటుందో ముష్కరులకు తెలిసేలా చేయండి: ఆర్మీకి పారికర్ సూచన


పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల మెరుపు దాడి నేపథ్యంలో భారత సైనికులకు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ధైర్యాన్ని నూరిపోయడమే కాక శత్రువులకు గుణపాఠం చెప్పాల్సిన గురుతర బాధ్యతను గుర్తు చేశారు. 66వ సైనిక దినోత్సవం సందర్భంగా నేటి ఉదయం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైనికుల్లో ఏ ఒక్కరు చనిపోయినా, తనకు చాలా బాధేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. త్యాగధనుల పట్ల తమకు గౌరవం ఉందని ప్రకటించిన పారికర్, శత్రువుకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసలు మన సైనికులు ప్రాణాలు కోల్పోతే, మనం ఏ స్థాయిలో బాధపడుతున్నామో, అదే బాధ శత్రువుకు అర్థమయ్యేలా చేయాలని ఆయన సైన్యానికి పిలుపునిచ్చారు. తద్వారా శత్రువుపై ఏ మాత్రం కనికరం చూపాల్సిన అవసరం లేదని ఆయన పరోక్షంగా సైన్యానికి సూచించారు.

  • Loading...

More Telugu News