: అభద్రతాభావంతోనే ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం: కాంగ్రెస్ నేత శ్రవణ్


నిజామాబాద్ ఎంపీ కవితకు తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం పట్ల టి.పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శలు చేశారు. అభద్రతాభావంతోనే ఆమెకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారన్నారు. మిగతా ఎంపీలకు లేని అభద్రతాభావం కవితకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రవణ్ ఆరోపణలు చేశారు. ఏడాదిన్నర కాలంగా రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ పాలనలోనే విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. కేసీఆర్ పాలన పూర్తిగా కామెడీ అయిందని, జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్ బూటకంగా మార్చేసిందని వ్యాఖ్యానించారు. నల్గగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా? అన్న కోమటిరెడ్డి సవాల్ ను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News