: కేన్సర్ తో పాప్ సింగర్ డేవిడ్ బోయి కన్నుమూత

ప్రముఖ బ్రిటిష్ గాయకుడు డేవిడ్ బోయి కన్నుమూశారు. గత వారమే 69వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన కేన్సర్ మహమ్మారితో ప్రాణాలు విడిచారు. గత 18 నెలల నుంచి డేవిడ్ కేన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాప్ సింగర్ గా ఎన్నో సంచలనాలు సృష్టించిన డేవిడ్ రచయిత కూడా. అంతేగాకుండా, పెయింటర్ గా, నటుడిగా కూడా ఆయన రాణించారు. విభిన్న కళా వాయిద్యాలను వాయించడంలోనూ ఆయనకు ప్రవేశం ఉంది. 1947, జనవరి 8న బ్రిటన్ లోని బ్రిక్స్టన్ లో జన్మించిన ఆయన పూర్తి పేరు డేవిడ్ రాబర్ట్ జోన్స్.