: 35 మంది అమెరికన్లకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన భారతీయ న్యాయస్థానం
35 మంది అమెరికా నావికులకు భారతీయ న్యాయస్థానం ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. 2013 అక్టోబర్ 12న అమెరికాకు చెందిన సీమన్ గార్డ్ ఓహియో నౌక ట్యుటికోరన్ తీరంలో ముందస్తు సమాచారం లేకుండా ప్రవేశించింది. దీంతో ఇండియన్ కోస్ట్ గార్డ్, కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అందులో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమయ్యాయి. దీంతో ఈ నౌకా సిబ్బందిపై కేసు నమోదు చేసిన భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్నుంచి దీనిపై విచారణ కొనసాగుతుండగా, నేడు ట్యుటికోరన్ న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ, వీరందరికీ ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది.