: ఉద్యోగాల పేరుతో మహిళలకు మోసం.. పాత బస్తీలో నకిలీ ట్రావెల్ ఏజెంట్లు అరెస్టు!


ఉద్యోగాల పేరిట మహిళలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్న నకిలీ ట్రావెల్ ఏజెంట్లను హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. పాతబస్తీలోని ఏజెంట్ల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, నకిలీ ట్రావెల్ ఏజెంట్ల మాయమాటల్లో పడి మోసపోయిన పలువురు మహిళలు గల్ఫ్ దేశాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ మేరకు తమకు సమాచారం అందిందని చెప్పారు.

  • Loading...

More Telugu News