: విశాఖ, అమరావతి కేంద్రంగా సేవా రంగంలో పెట్టుబడులు వస్తాయి: గల్లా జయదేవ్
విశాఖపట్నం, అమరావతి కేంద్రంగా సేవా రంగంలో పెట్టుబడులు వస్తాయని భాగస్వామ్య సదస్సులో ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. అంతేగాక రాయలసీమ కేంద్రంగా పారిశ్రామిక పెట్టుబడులు కూడా రానున్నాయని, ఇటు కోస్తా ప్రాంతంలో ఆహారశుద్ధి పరిశ్రమలు వస్తాయని వెల్లడించారు. ఇక వచ్చే 3-5 ఏళ్లలో అమర్ రాజా గ్రూప్ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడులు పెడతామని జయదేవ్ చెప్పారు.