: కేటీఆర్ సవాల్ కు ఎర్రబెల్లి ప్రతి సవాల్
గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రతిపక్షాలు రాజీనామా చేస్తాయా? అని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్వీకరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో ఓటమిపాలైతే కేటీఆర్ రాజీనామా అవసరం లేదని, టీడీపీలో పోటీ చేసి, టీడీపీ పెట్టిన భిక్షతో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు వెళ్తారా? అని సవాలు విసిరారు. దీనికి కేటీఆర్ సై అంటే తాము కూడా సై అని ఆయన ప్రతి సవాల్ విసిరారు. కేటీఆర్ సవాళ్లు కొత్తకాదని ఆయన పేర్కొన్నారు.