: ఎన్ఐఏ విచారణకు హాజరైన ఎస్పీ సల్వీందర్ సింగ్
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముందు పంజాబ్ ఐపీఎస్ అధికారి సల్వీందర్ సింగ్ విచారణకు హాజరయ్యారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి సందర్భంగా ఎస్పీ సల్వీందర్ సింగ్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడి ముందు పఠాన్ కోట్ సరిహద్దుల్లో తనను ఉగ్రవాదులు అపహరించారని చెబుతున్న వ్యాఖ్యల్లో పొంతన లేని కారణంగా ఆయనకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. దీంతో ఢిల్లీ రావాలని ఆయనను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ నిర్వహించిన లైడిటెక్టర్ పరీక్షలు ఎదుర్కొన్నట్టు సమాచారం.