: టీఆర్ఎస్ లో చేరుతున్న గ్రేటర్ టీడీపీ మాజీ కార్పొరేటర్లు!
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో గ్రేటర్ లో టీడీపీకి పెద్ద షాకే తగిలింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, చంపాపేట మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి, మరో మాజీ కార్పొరేటర్ భర్త గజ్జల మధుసూదన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం ఆ ముగ్గురూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది. నెల కిందటే టీడీపీ నేత, మాజీ మంత్రి విజయరామారావు టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ కాజ సూర్యనారాయణరావు కూడా టీడీపీని వీడారు. ఇలా ఎన్నికల సమయంలో ఒక్కొక్కరూ పార్టీని వదిలిపెట్టడం టీడీపీకి పెద్ద ఇబ్బందే.