: రేపు మోగనున్న గ్రేటర్ ఎన్నికల నగారా!


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ రేపు విడుదల కానున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్న ఉద్దేశంతో, కోడ్ అమల్లోకి రాకముందే అధికార టీఆర్ఎస్ ఓటర్లను మంచి చేసుకునేందుకు పలు రాయితీలను ప్రకటించింది కూడా. గ్రేటర్ పరిధిలో కరెంటు, నీటి బిల్లుల బకాయిల రద్దు, పన్నుల్లో కోత, సులువుగా భవనాల రెగ్యులరైజేషన్, డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితరాలను ప్రకటించింది. ఇప్పుడిక అన్ని పార్టీలూ తమ తమ గెలుపోటములపై అంచనాలు వేస్తూ, అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి.

  • Loading...

More Telugu News