: ఇక్కడే జైలుకెళ్లానన్న వెంకయ్య... పెద్దగా నవ్వేసిన చంద్రబాబు!


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ప్రసంగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గలగలా నవ్వేశారు. విశాఖపట్టణంలో జరుగుతున్న సీఐఐ సదస్సులో నేడు ఇద్దరూ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విశాఖపట్టణానికి బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడారు. సాధారణంగా గుక్కతిప్పుకోకుండా మాట్లాడడంలో వెంకయ్యనాయుడును మించిన రాజకీయ నాయకుడు లేడనేది అక్షర సత్యం. ఏ అంశం మీదైనా, ఏ భాషలో అయినా ప్రాసలతో గుక్కతిప్పుకోకుండా మాట్లాడడంలో ఆయనకు ఆయనే సాటి. తన వాగ్ధాటితో ఎంతటివారినైనా మంత్రముగ్ధులను చేయడంలో వెంకయ్యనాయుడు స్పెషలిస్టు. అలాంటి వెంకయ్యనాయుడుకి విశాఖపట్టణం అనగానే అయన గొంతులో అవ్యాజమైన ప్రేమ పొంగిపొరలుతుంది. ఎన్నో అనుభూతులు ఆయన మదిలో మెదులుతాయి. తాజాగా ఆయన మరోసారి గతంలోకెళ్లిపోయారు. ఇక్కడి బీచ్ పై మాట్లాడేప్పుడు ఆయన అలాంటి భావాన్నే కనబరిచారు. ఈ సందర్భంగా ముసిముసి నవ్వులు నవ్విన చంద్రబాబు, 'ఇక్కడే నేను జైలుకెళ్లా'నని వెంకయ్య చెప్పగానే పెద్దగా నవ్వేశారు.

  • Loading...

More Telugu News