: అగ్రిగోల్డ్ పై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంలో కారెం శివాజీ పిటిషన్


తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన అగ్రిగోల్డ్ భారీ కుంభకోణంపై మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అందులో కోరారు. దీనిపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే వాదనలు వినిపించాలని పిటిషనర్ కు సూచించింది. కాగా ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి హైకోర్టు అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News