: మట్ డామన్, సిల్వెస్టర్ స్టాలోన్, కేట్ విన్ స్లెట్ లకు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు


73వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం వందలాది మంది హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో వైభవంగా జరుగుతుండగా, టైటానిక్ భామ కేట్ విన్ స్లెట్, హీరోలు మట్ డామన్, సిల్వెస్టర్ స్టాలోన్, జాన్ హమ్ తదితరులు అవార్డులను గెలుచుకున్నారు. యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా నటించిన కేట్ కు ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కింది. 'క్రీడ్' చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించిన సిల్వెస్టర్ స్టాలోన్ కు, 'ది మార్షియన్' చిత్రానికిగాను మట్ డామన్ కు అవార్డులు లభించాయి. ఉత్తమ విదేశీ చిత్రంగా హంగేరీకి చెందిన 'సన్ ఆఫ్ సౌల్' చిత్రం నిలిచింది. 'ది ఎఫైర్' చిత్రంలో నటించిన మౌరా టియర్నీ, 'మిస్టర్ రోబోట్' నటుడు క్రిస్టియన్ స్లాటర్ కు అవార్డులు లభించాయి. ఉత్తమ యానిమేషన్ చిత్రంగా 'ఇన్ సైడ్ ఔట్' నిలువగా, 'అమెరికన్ హారర్ స్టోరీ: హోటల్' చిత్రంలో నటనకు గాను లిమిటెడ్ సిరీస్ విభాగంలో గాయకురాలు లేడీ గాగాకు అవార్డు దక్కింది.

  • Loading...

More Telugu News