: ఇక్కడే నేను చాలా నేర్చుకున్నాను: వెంకయ్యనాయుడు


'విశాఖపట్టణం సుందరమైన నగరం, ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఇక్కడి ప్రజలు ఎంతో మంచి వారు' అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖపట్టణంలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పట్టణం విశాఖపట్టణమని అన్నారు. రోజంతా పని చేసుకుని సాయంత్రం అలా బీచ్ కు వెళ్లి వస్తే కష్టం మర్చిపోవచ్చని చెప్పారు. దీనిని 'విశాఖ సుందరి' అని పిలవచ్చని చెప్పారు. ఎంతో అభివృద్ధి చెందాల్సిన విశాఖ కొంత నిర్లక్ష్యానికి గురైనా రాష్ట్ర విభజన తరువాత పూర్తి స్ధాయిలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఇక్కడే చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పారు. నాలుగేళ్లు విద్యనేర్పింది ఈ నగరమేనని ఆయన చెప్పారు. ఇక్కడే తాను జైలు జీవితం అనుభవించానని ఆయన గుర్తు చేసుకున్నారు. జీవితంలో చాలా విషయాలను విశాఖే నేర్పిందని ఆయన చెప్పారు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వాటన్నింటినీ అందుకోవాల్సిన బాధ్యత పారిశ్రామిక వేత్తలదేనని, అందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు తాము సమకూరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. 'నేను ఎక్కడికెళ్లినా ఇదే నా రాష్ట్రమని' ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News