: 41 సినిమాల్లో నటించి...మొత్తం 3 లక్షల కోట్లకు పైగా వసూలు చేసిన హాలీవుడ్ నటుడు
హాలీవుడ్ సినీ అభిమానులకు హారిసన్ ఫోర్డ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియానా జోన్స్, స్టార్ వార్స్, ఎయిర్ ఫోర్స్ వన్ సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించిన హారిసన్ ఫోర్డ్ ఇప్పటి వరకు 41 సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలు హాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఈ సినిమాలు ఇప్పటి వరకు 4.7 బిలియన్ డాలర్ల (3 లక్షల కోట్లకు పైగా) వసూళ్లు సొంతం చేసుకున్నాయి. దీంతో ఇప్పటివరకు హాలీవుడ్ లో 68 సినిమాల్లో 4.6 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి నెంబర్ వన్ మనీ మేకర్ గా ఉన్న శామ్యూల్ ఎల్ జాక్సన్ (68) ద్వితీయ స్ధానానికి పడిపోయాడు. 71 ఏళ్ల హారిసన్ ఫోర్డ్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, అద్భుతమైన డైరెక్టర్ కూడా కావడం విశేషం.