: మరింత పెద్ద దాడికి సిద్ధంగా ఉండండి: ఇండియాకు హెచ్చరికగా టెర్రర్ వీడియో
ఇండియాపై మరింత పెద్ద ఉగ్రదాడిని చేస్తామని యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ ఓ వీడియోను విడుదల చేసింది. పాక్ కేంద్రంగా నడుస్తున్న ఓ వెబ్ సైట్ ద్వారా తొలుత వెలుగులోకి వచ్చిన వీడియోలో, యూజేసీ ఉగ్రనేత ఒకరు భారత్ కు హెచ్చరికలు పంపాడు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి తమ పనేనని ఈ సంస్థ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ తాజా వీడియోలో, ఇండియాపై భవిష్యత్తులో మరిన్ని దాడులు చేస్తామని అన్నాడు. కాశ్మీర్ లో వేర్పాటు వాదులకు మద్దతిస్తామని తెలిపాడు.