: బీఎస్ఎఫ్ కు చిక్కిన పాకిస్థాన్ గూఢచారి!


పంజాబ్ లో భారత సైనిక స్థావరాల వద్ద పాకిస్థాన్ గూఢచారిని సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 25 సంవత్సరాల వయసున్న యువకుడు గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ లోని బీఎస్ఎఫ్ పోస్టు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతన్ని అరెస్ట్ చేసిన భద్రతా దళాలు, తదుపరి విచారణ కోసం బతాలా పోలీసులకు అప్పగించినట్టు ఎస్ఎస్పీ దల్జీందర్ వెల్లడించారు. బీఎస్ఎఫ్ పోస్టుకు సమీపంలో ఉన్న పొదల మాటున రహస్యంగా కూర్చున్న ఇతన్ని అదుపులోకి తీసుకున్నామని, అతని వద్ద ఉన్న ఫోన్ లో ఆర్మీ ట్యాంకులు, పలు భవంతుల చిత్రాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఇతని పేరు హర్ ప్రీత్ సింగ్ అని, పాక్ తరఫున గూఢచారిగా పనిచేస్తూ, భారత రహస్యాలను చేరవేస్తున్నాడని ఇండియా టుడే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

  • Loading...

More Telugu News