: మనం మరచిన దేవుళ్లను భక్తితో కొలుస్తున్న జపాన్!


"ముక్కోటి దేవతలూ ఒక్కటయ్యారు... చక్కన్ని పాపనూ ఇక్కడుంచారు..." అన్న పాట అందరూ విన్నదే. దేవతలు ఎంత మంది అని ఎవరైనా అడిగితే మూడు కోట్ల మంది అన్నది హిందువుల నమ్మకం. వారి పేర్లను చెప్పమని అడిగితే... ఎవరైనా నోరెళ్లబెట్టడం ఖాయం. ఇండియాలో రెగ్యులర్ గా పూజించే దేవుళ్లు ఓ 20 మంది వరకూ ఉంటారని అంచనా. మిగతావారి సంగతి? అందరమూ మరచిపోయాం. కానీ, జపాన్ లో అలా కాదు. ఇండియా మరచిన హిందూ సంస్కృతిని, సంస్కృత భాషనూ ఆ దేశం పరిరక్షిస్తోంది. మనం మరచిన ఎందరో దేవుళ్లను పూజిస్తోంది. సరస్వతి, లక్ష్మి, వినాయకుడు తదితర పేర్లున్న దేవుళ్లతో పాటు ఇండియాలో పెద్దగా పూజలెరుగని ఇంద్రుడు, బ్రహ్మ, గరుత్మంతుడు తదితర ఎందరో దేవుళ్లకు జపాన్ ప్రజలు పూజలు చేస్తున్నారు. జపాన్ లో కొలువైన దేవాలయాలు, అక్కడ జరుగుతున్న పూజాధికాల వివరాలతో కూడిన ఛాయా చిత్ర ప్రదర్శన నేడు కోల్ కతాలో ప్రారంభం కానుంది. జపాన్ ఫౌండేషన్, చరిత్రకారుడు బినోయ్ కే భల్ లు ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తుండగా, భారత హిందూ సమాజానికి తెలియని ఎన్నో అరుదైన చిత్రాలు ప్రదర్శింపబడనున్నాయి. ఇండియా నుంచి అదృశ్యమైన 'బీజాక్షరాలు' తొలి సంస్కృత ప్రతి కూడా ఇక్కడ ప్రదర్శింపబడనుందని ఇండియన్ మ్యూజియం అధికారులు వెల్లడించారు. 6వ శతాబ్దానికి చెందిన ఈ ప్రతిని జపాన్ ప్రభుత్వం అత్యంత భద్రంగా దాచిందని, అక్కడ ఇప్పటికీ సంస్కృతం నేర్పుతున్న పాఠశాలలు ఉన్నాయని బినోయ్ తెలిపారు. జపాన్ సూపర్ మార్కెట్లలో విరివిగా అమ్ముడయ్యే పాల బ్రాండ్ పేరు 'సుజాత' అని, ఆ పాలతో దేవతా మూర్తులకు అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News