: సరిహద్దులో డ్రాగన్ తాజా ఉల్లంఘన.. చైనాలో ఖుర్షీద్ పర్యటన !


డ్రాగన్ సైన్యం మరోసారి భారత్ సరిహద్దును ఉల్లంఘించింది. ఈసారి గగనతలం ద్వారా ఈ ఉల్లంఘనలు చేసినట్లు సమాచారం. ఛైనాకు చెందిన ఓ హెలికాప్టర్ భారత్ భూభాగంలోకి చొచ్చుకువచ్చిందని తెలుస్తోంది. చైనా చేస్తున్న ఈ బహిరంగ ఉల్లంఘనతో రెండు దేశాల మధ్య సంబంధాలు పాక్షికంగా దెబ్బతిన్నాయనటంలో సందేహంలేదు.

కాగా, భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మే 9న చైనాలో పర్యటించనున్నట్లు కొంతసేపటి కిందట ఢిల్లీలో ప్రకటించారు. ఇరుదేశాల నడుమ మంచి సంబంధాల కోసం సంవత్సరాల తరబడి సాగిన కృషిని నిరాకరించలేమని ఖుర్షీద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చర్చలు జరపబోతున్నాం కాబట్టి, ఇదో సదవకాశంగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల15న భారత్, చైనా సరిహద్దులోని లడఖ్ వద్ద చైనా సేనలు భారత్ భూభాగంలోకి చొరబడ్డాయి. ఈ నేపథ్యంలో సంక్షోభం తలెత్తింది.

  • Loading...

More Telugu News