: ఆత్మీయుల మధ్య కంటతడి పెట్టిన ముఫ్తీ


జమ్ముకాశ్మీర్ కు కాబోయే ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తన పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో తండ్రిని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. అయితే, ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించే విషయంలో తన స్పందనను తెలియజేయలేదు. ఆమె తండ్రి, ముఖ్యమంత్రి మహ్మద్ సయూద్ ముఫ్తీ గత గురువారం కన్నుమూశారు. అనంతరం మెహబూబా ముఫ్తీనే బాధ్యతలు స్వీకరిస్తారనే వార్తలు వస్తున్నా ఆమె ఇప్పటివరకూ దీనిపై మౌనం వహిస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా దీనిపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్వయంగా ముఫ్తీని కలుసుకోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.

  • Loading...

More Telugu News