: పఠాన్ కోట్ ఎఫెక్ట్... పాక్ తో చర్చలు రద్దు చేసుకున్న ఇండియా


అనుకున్నంతా అయింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి, శాంతి చర్చలకు విఘాతం కలిగించింది. ఈ నెల 15న పాకిస్థాన్ తో జరగాల్సిన విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. "ఇప్పటివరకూ పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన వారిపై పాక్ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మాకు అసంతృప్తిగా ఉంది. పాక్ చర్యలు తీసుకోనంత వరకూ శాంతి చర్చలు ఉండవు. అందువల్ల కార్యదర్శుల స్థాయి చర్చలను రద్దు చేస్తున్నాం" అని ధోవల్ తెలిపారు.

  • Loading...

More Telugu News