: ముగ్గులో 'చంద్ర'న్న చిత్రం...భళారే విచిత్రం!
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బీఎస్సీ విద్యార్థి లారీడు ఉప్పును ఉపయోగించి వేసిన చంద్రబాబు చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు 150 అడుగుల చుట్టు కొలతతో ఇక్కడి ఏబీఎం డిగ్రీ కాలేజీలో మూడు రోజుల పాటు శ్రమించి ఎస్.కె. హర్షద్ అనే యువకుడు ఈ ముగ్గు వేశాడు. హైదరాబాద్ లోని వాణి డిగ్రీ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ విద్యను అభ్యసిస్తున్న హర్షద్, తాను నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబునాయుడికి మరింత స్ఫూర్తిని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ ముగ్గు చిత్రాన్ని గీసినట్టు చెబుతున్నాడు.