: సిగరెట్ తాగితే తప్పక చెప్పండి...ఇది 'పాలసీ'!


మీరు సిగరెట్ తాగుతారా... అయితే ఆ విషయాన్ని బీమా పాలసీ తీసుకునే ముందు సంబంధిత సిబ్బందికి తప్పకుండా తెలియజేయండి. లేకపోతే చిక్కుల్లో పడిపోతారు. ఈమధ్య కాలంలో పలు బీమా కంపెనీలు పాలసీదారుల సిగరెట్ అలవాట్లను సీరియస్ గా పరిగణిస్తున్నాయి. పైగా దీనిని అనుసరించే.. ఆ సంస్థలు బీమా ప్రీమియంను కూడా నిర్దేశిస్తున్నాయి. సిగరెట్ కాల్చేవారు... ఈ అలవాటు లేనివారితో పోలిస్తే అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఈ అలవాటు వచ్చినా దానిని దాచకుండా బీమా కంపెనీకి తెలియజేయాలి. అప్పుడే క్లెయిమ్ ల సమయంలో ఇబ్బందులు తలెత్తవు.

  • Loading...

More Telugu News