: రామమందిరం తరువాత కాశీ, మధుర కేసులను గెలుస్తాం: సుబ్రహ్మణ్యస్వామి


అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తామని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. ఢిల్లీలో రామమందిర నిర్మాణంపై రెండవరోజు జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు కూడా రామమందిర నిర్మాణానికి మద్దతు పలుకుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో రామమందిర నిర్మాణం కేసులో విజయం సాధించిన తరువాత మధుర, కాశీ విశ్వనాధ మందిరం కేసులలో కూడా విజయం సాధిస్తామన్నారు. తమ దగ్గరున్న ఆధారాల ప్రకారం రామమందిర నిర్మాణం కేసు అంత కఠినమైనదేమీ కాదన్నారు.

  • Loading...

More Telugu News