: నిన్న 32 కంపెనీలు - రూ. 1.95 లక్షల కోట్లు, నేడు మరో 49 ఒప్పందాలు!


విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 'సూర్యోదయాంధ్రప్రదేశ్' పెట్టుబడుల సదస్సులో భాగంగా నిన్న తొలిరోజున 32 కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ సర్కారు రూ. 1.95 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోగా, నేడు మరో 49 ఒప్పందాలు కుదరనున్నాయి. మొత్తం 32 సంస్థలతో డీల్స్ కుదరగా, వీటి ద్వారా 95 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరావతిలో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించిన చంద్రబాబు, భవిష్యత్తులో రాష్ట్రం సౌర విద్యుత్ కేంద్రంగా మారనుందన్న ధీమాను వ్యక్తం చేశారు. విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో 22 ఒప్పందాలు కుదిరాయి. గనుల రంగంలో 1, పరిశ్రమల రంగంలో 9 ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలోని రాంబెల్లి వద్ద జలాంతర్గాములు, విమాన వాహక యుద్ధనౌకల తయారీ కోసం రిలయన్స్ డీల్ కుదుర్చుకుంది. నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిధిలో ఆమోటోటివ్, ఎయిర్ స్పేస్ పరికరాల తయారీకి భారత్ ఫోర్జ్ డీల్ కుదుర్చుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మరో సంస్థ కర్నూలు జిల్లాలో బంగారం వెలికితీతకు రూ. 300 కోట్ల విలువైన ఏపీ సర్కారుతో డీల్ పై సంతకాలు చేసింది. మొత్తం 300 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, 1100 మందికి పైగా దేశీయ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరైనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

  • Loading...

More Telugu News