: 'మరేదైనా రాస్తా కానీ జీవిత చరిత్ర మాత్రం రాయ'నంటున్న ఒడిశా ముఖ్యమంత్రి
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి రాకముందే రచయితగా ఖ్యాతి గడించారు. నవీన్ పట్నాయక్ భారతీయ మూలికా వైద్యంపై రాసిన 'ఏ గార్డెన్ ఆఫ్ లైఫ్', రాజస్ధాన్ లోని బికనీర్ పై రాసిన 'డస్టర్ కింగ్ డమ్', 1590-1947 మధ్య భారత దేశ చరిత్రను వివరిస్తూ రాసిన 'ఎ సెకెండ్ ప్యారడైజ్' పుస్తకాలు మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. భువనేశ్వర్ లో లిటరరీ ఫెస్టివల్ లో పాల్గొన్న సందర్భంగా నవీన్ పట్నాయక్ జీవిత చరిత్రను 'గెలవడం ఎలా?' (రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఓటమి ఎరుగని నేత) అనే పేరిట రాయమని పలువురు రచయితలు ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నిజజీవిత గాథ అంత ఆసక్తికరంగా ఉండదని, అందుకే అది రాయనని అన్నారు. ఒకవేళ రాస్తే కాల్పనిక గాథలే రాయాలని ఆయన పేర్కొన్నారు. పని ఒత్తిడి వల్ల పెన్ను పట్టలేకపోతున్నానని ఆయన చెప్పారు. భాషా సంస్కృతిని కాపాడుకోవాలంటే మూలశ్రేణి కథ చెడిపోకుండా పాత రచనలను ప్రధాన భాషల్లోకి అనువదించాలని ఆయన సూచించారు.