: రాజకీయాల్లో వార్నింగ్ లు ఇచ్చుకోవడం సర్వసాధారణం: రాంగోపాల్ వర్మ


రాజకీయాల్లో నేతలు ఒకరికొకరు వార్నింగ్ లు ఇచ్చుకోవడం సర్వసాధారణం అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. 'వంగవీటి' పేరిట తాను సినిమా తీయడంపై ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, నిత్యం తగవులాడుకునేలా మాట్లాడే రాజకీయ నాయకులంతా తన్నుకోరన్న విషయం గుర్తించుకోవాలని అన్నారు. 'వంగవీటి' సినిమాలో అప్పుడు జరిగిన సంఘటనలు చెప్పడమే తప్ప, విద్వేషాలు రేపడం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. తాను కొత్తగా విద్వేషాలు రేపడానికి ఇప్పుడు ఏమీ లేదని, రేగాల్సిన విద్వేషాలు అప్పుడే రేగిపోయాయని, వాటినే తాను ఈ సినిమాలో చెబుతాను తప్ప కొత్త విషయం చెప్పడం లేదని, తానేదైనా కొత్తది చెప్పడానికి ప్రయత్నించనని వర్మ అన్నారు. ఈ సినిమా విషయంలో ప్రజల మధ్య విద్వేషం రేగడానికి ఎటువంటి అవకాశం లేదని వర్మ స్పష్టం చేశారు. సినిమాకు ప్రజలను మార్చేంత శక్తి లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News