: చర్చలు నడుస్తున్నాయి...ఇంకా సంతకం చేయలేదు: సోనాక్షి సిన్హా
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చెల్లెలు జీవిత కథతో అపూర్వ లఖియా రూపొందించనున్న సినిమా 'హసీనా ద క్వీన్ ఆఫ్ ముంబై'కి ఇంకా సంతకం చేయలేదని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తెలిపింది. ముంబైలో మాట్లాడుతూ, ఆ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉందని చెప్పింది. ఇంకా సంతకం చేయలేదని, సంతకం చేశాక ఆ సినిమా గురించి మాట్లాడుతానని చెప్పింది. అంత పవర్ ఫుల్ పాత్రకు తనను ఎంపిక చేయడం ఆశ్చర్యకరంగా అనిపించిందని సోనాక్షి తెలిపింది. అయితే ఈ సినిమాలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేసింది.