: చందమామపై కాలనీల ఏర్పాటుకు శాస్త్రవేత్తల ప్రయత్నాలు


నెదర్లాండ్స్ లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2020-2030 పేరుతో ఓ సింపోజియం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నోటర్ డామ్ కు చెందిన క్లైవ్ నీల్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ, చంద్రుడిపై 2030 నాటికి వ్యోమగాములు, రోబోల సాయంతో కాలనీ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. చంద్రుడిపై నివాసం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనికోసం చంద్రుడి పరిస్థితులపై సరైన అంచనాకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రుడిపై వనరుల గురించి చర్చించుకునేముందు అవి మనకు సరిపోతాయో లేదో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రుడిపై నివాసం సాధ్యమైతే, భవిష్యత్ లో అంగారకుడు వంటి గ్రహాలకు మానవ ప్రయాణానికి సులువైన బాటలు వేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News