: కొత్త టీవీ స్క్రీన్ ఆవిష్కరణ... పూర్తి ట్రాన్స్ పరెంట్!


పేపర్ లా చుట్టేసే టీవీని ఎల్ జీ కంపెనీ ఆవిష్కరిస్తే... పానసోనిక్ కంపెనీ ట్రాన్స్ పరెంట్ టీవీని ఆవిష్కరించి సత్తా చాటింది. ఈ టీవీని ఆఫ్ చేసినప్పుడు దాని వెనుకనుండే వస్తువులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. టీవీ ఆన్ చేస్తే మాత్రం అవి కనపడవు, చానెల్ దృశ్యం కనిపిస్తుంది. ఈ టీవీలో పారదర్శక గ్లాస్ ప్యానెల్ మాత్రమే ఉంటుంది. ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ దీనిని అమర్చుకోవచ్చు. ఈ గ్లాస్ ప్యానెల్ లో ఉండే మైక్రో ఎల్ ఈడీలతో స్క్రీన్ పై బొమ్మలు కనపడతాయి. టీవీ ఆఫ్ చేస్తే ట్రాన్స్ పరెంట్ గ్లాస్ గా మారిపోతుంది. ఈ టీవీలో కనపడే దృశ్యాలు 1080 పిక్సెల్ తో ఉంటాయి. భవిష్యత్ లో 4కే, 5కే రిజల్యూషన్ తో టీవీలు రానున్నాయని పానసోనిక్ చెబుతోంది.

  • Loading...

More Telugu News