: ఆంధ్రప్రదేశ్ లో 15 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నా: అనిల్ అంబానీ


ఆంధ్రప్రదేశ్ లో 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ వెల్లడించారు. విశాఖపట్టణంలో జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని తెలిపారు. విశాఖపట్టణం జిల్లా రాంబిల్లిలో 5 వేల కోట్ల రూపాయలతో నౌకాదళ స్థావరం ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. మరో 10 వేల కోట్ల రూపాయలు రక్షణ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

  • Loading...

More Telugu News