: ఇది అసలైన పరీక్ష...ఇది గెలిస్తే మజా: జెఫ్ లాసన్


గతేడాది చివర్లో న్యూజిలాండ్, వెస్టిండీస్ లపై సొంతం చేసుకున్న విజయాలను చూసి ఆసీస్ ఆటగాళ్లు మురిసిపోతే బొక్క బోర్లా పడతారని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జెఫ్ లాసన్ హెచ్చరించాడు. న్యూజిలాండ్ పై సాధించిన విజయం చెప్పుకోదగ్గది కాదన్న లాసన్, పూర్వవైభవం కోల్పోయిన వెస్టిండీస్ జట్టును ఓడించడం పెద్ద విషయం కాదని పేర్కొన్నాడు. టీమిండియా రూపంలో ఆస్ట్రేలియా జట్టు ముందు అసలైన సవాల్ నిల్చుందని, ఈ సిరిస్ లో విజయం సాధిస్తే అది గొప్పేనని లాసన్ పేర్కొన్నాడు. అదీ కాక ఫ్లడ్ లైట్ల వెలుతురులో టీమిండియాతో ఆడడం సవాలేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ పూర్తైన తరువాత ఆసీస్ అసలు సత్తా ఏంటో తెలిసిపోతుందని లాసన్ పేర్కొన్నాడు. రాణించిన 20 మంది ఆటగాళ్లను సానబెడితే వరల్డ్ కప్ నాటికి ఆసీస్ అభేద్యంగా మారుతుందని ఆయన చెప్పాడు. విజయాలపై ఆసీస్ ఆటగాళ్లు దృష్టి పెట్టాలని లాసన్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News