: గ్రేటర్ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దే!: తలసాని
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ పార్టీనే వరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు డివిజన్ల వారీగా నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించామని అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ చెప్పేదే చేస్తుందని, చెసేదే చెబుతుందని చెప్పారు. మరో మూడేళ్లలో హైదరాబాదులో ట్రాఫిక్ జామ్ లు ఉండవని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యపూర్వకంగా, స్నేహంగా ఉన్నారని, కానీ ప్రతిపక్షాలు లేనిపోని వ్యాఖ్యలతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజలకు అంతా తెలుసని, వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.