: షమి దురదృష్టం స్రాన్ పాలిట అదృష్టంగా మారింది
అంతర్జాతీయ క్రికెట్లో చిన్న సంఘటనలు కొందరిపాలిట దురదృష్టంగా మారితే, మరి కొందరి పాలిట అదృష్టంగా పరిణమిస్తున్నాయి. ప్రస్తుతానికి టీమిండియాలో అలాంటి పరిస్థితే నెలకొంది. ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ తొడ కండరాలు పట్టేయడంతో ఇంటి బాట పట్టనున్నాడు. దీంతో అతని స్థానంలో సరైన బౌలర్ కోసం అన్వేషించిన టీమిండియా అతనికి ప్రత్యామ్నాయంగా పంజాబ్ బౌలర్ బరిందర్ స్రాన్ కు జట్టులో స్థానం కల్పించనుంది. లెప్ట్ ఆర్మ్ పేసర్ అయిన బరిందర్ స్రాన్ ఆసీస్ తో తొలి వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయనున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావడం అతనికి అదనపు బలం కానుంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించిన స్రాన్ స్థిరమైన ప్రదర్శన కనబరిస్తే టీమిండియాకు బౌలింగ్ లోటు తీరనుంది.