: సంక్రాంతి కోసం భీమవరం వెళ్తున్నా: తలసాని
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వేడుకలు అద్భుతంగా జరుగుతాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నానని చెప్పారు. ప్రతిఏటా తను సంక్రాంతిని ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించుకోవడానికే ఆసక్తి చూపుతానని ఆయన పేర్కొన్నారు. భీమవరం ప్రజలు చూపే ప్రేమాప్యాయతలకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందేనని ఆయన వెల్లడించారు. వారి ఆప్యాయతను మర్చిపోలేకే తాను భీమవరం వెళ్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కేవలం సంక్రాంతి సంబరాలలో పాలుపంచుకోవడానికే తప్ప, కోడి పందాల కోసం వెళ్లడం లేదని ఆయన తెలిపారు.