: యూరప్ ట్రిప్ ముగించిన కాంగ్రెస్ యువరాజు... ఢిల్లీ చేరిన రాహుల్ గాంధీ


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి తన విదేశీ పర్యటనను కాస్తంత తొందరగానే ముగించారు. న్యూ ఇయర్ కు ముందు యూరప్ పర్యటనకు బయలుదేరుతున్నానని చెప్పిన రాహుల్, టూర్ కు ముందే దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేసి వెళ్లిపోయారు. యూరప్ లోనే ఆయన న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. అయితే యూరప్ లో ఆయన ఏమేం చేశారన్న వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. యూరప్ పర్యటనను ముగించుకుని నేటి ఉదయం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. గతంలో దాదాపు రెండు నెలల పాటు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్లిన రాహుల్, అన్ని వర్గాల నుంచీ విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే నాటి విపత్కర పరిస్థితులను మళ్లీ ఎదుర్కొనే సాహసం చేయలేకనేమో ఆయన తాజా యూరప్ పర్యటనను తొందరగానే ముగించుకుని వచ్చారు.

  • Loading...

More Telugu News