: నర్సును తాకాడని పేషంట్ ను చావగొట్టిన రష్యా డాక్టర్... వీడియో వైరల్!


అనారోగ్యం బారిన పడిన ఓ రష్యన్ ఆసుపత్రికి వచ్చాడు. తనకు వైద్య పరీక్షలు చేస్తున్న నర్సును అతడు అసభ్యకర రీతిలో తాకాడు. అంతే, దానిని గమనించిన కండలు పెంచిన డాక్టర్ ఆ రోగిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇంకేముంది ఆసుపత్రి ల్యాబ్ లోనే ఆ రోగి కన్నుమూశాడు. ఆగ్రహావేశంలో రోగి, అతడి వెంట వచ్చిన అటెండెంట్ పై పంచ్ ల వర్షం కురిపించిన వైద్యుడు... రోగి చనిపోయాడని తెలుసుకుని బతికించేందుకు విశ్వయత్నం చేశాడు. అయితే ఆ వైద్యుడి యత్నం ఫలించలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. రష్యాలోని బొల్ గోరోడ్ నగరంలోని ఓ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఇది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఈ ఘటన మొత్తాన్ని రికార్డ్ చేసింది. ఆ వీడియో దృశ్యాలు మీడియా చానెళ్లకు చిక్కాయి. ఇంకేముంది, రష్యాలోని మొత్తం అన్ని న్యూస్ చానెళ్లు ఈ వీడియోను ప్రసారం చేశాయి. చివరకు ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కేసింది. వైరల్ అయిపోయింది. రోగిపై దాడి చేసిన వైద్యుడిని ఇల్యా జలందినోవ్ గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News