: టీఆర్ఎస్ పై లోకేశ్ సెటైర్లు... ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకుందని ట్వీట్స్


తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు ట్విట్టర్ పోరు సాగించారు. గతంలో పలుమార్లు ట్విట్టర్ లో టీఆర్ఎస్ పై సెటైర్లు విసిరిన లోకేశ్ పెద్ద చర్చకే తెర లేపారు. తాజాగా గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను పురస్కరించుకుని నేటి ఉదయం ఆయన మరోమారు ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇందుకోసం వారి పట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. లోకేశ్ ట్వీట్లపై మరోమారు టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News