: ‘పచ్చ’ చొక్కాలో వెంకయ్య!... అమరావతి మారథాన్ లో టీడీపీ నేత నానితో కలిసి అడుగు


విజయవాడలో నేటి ఉదయం ప్రారంభమైన అమరావతి మారథాన్ లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నిత్యం తెలుపు రంగు దుస్తులు, అచ్చమైన పంచెకట్టులో తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణలో కనిపించే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మారథాన్ కు పసుపు రంగు టీషర్ట్ వేసుకుని హాజరయ్యారు. విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానితో కలిసి ఇందిరాగాంధీ స్టేడియానికి వచ్చిన వెంకయ్య 10 కిలోమీటర్ల పరుగును ప్రారంభించారు. నానితో కలిసి ఆయన మారథాన్ లో కొద్దిదూరం నడిచారు. ‘పచ్చ’ పార్టీగా పేరుపడ్డ టీడీపీకి చెందిన కేశినేని నాని తెలుపు రంగు చొక్కాలో అక్కడికి వస్తే, తెలుపు రంగులో కనిపిస్తారనుకున్న వెంకయ్య పసుపు రంగు టీషర్ట్ వేసుకుని వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.

  • Loading...

More Telugu News