: అయోధ్యలో రామ మందిరానికి రాజీవ్ గాంధీ మద్దతు!: తనకు చెప్పారంటున్న సుబ్రహ్మణ్యస్వామి


బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి నిన్న మరో బాంబు పేల్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మద్దతిచ్చారని ఆయన పేర్కొన్నారు. నిన్న ఢిల్లీ యూనివర్సిటీలో రామ మందిర నిర్మాణంపై జరిగిన సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అయోధ్యలో రామ మందిరం నిర్మితమై తీరుతుంది. ఏ చిన్న అవకాశం చిక్కినా నేనూ మద్దతిస్తా. ఈ విషయంలో పార్టీల ప్రమేయాన్ని పట్టించుకోను.. అని రాజీవ్ గాంధీ స్వయంగా తనకు చెప్పారని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన రామాయణ్ టీవీ సీరియల్ దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిందని కూడా స్వామి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ రామ మందిరానికి మద్దతు పలకాల్సిందేనని స్వామి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News