: విజయవాడలో ‘అమరావతి మారథాన్’ హోరు... తరలివచ్చిన వేలాది మంది నగరవాసులు
విజయవాడ నగరం ‘అమరావతి మారథాన్’ నినాదాలతో హోరెత్తుతోంది. 21, 10, 5 కిలోమీటర్ల వారీగా నిర్వహిస్తున్న అమరావతి మారథాన్ కు నగరవాసులు పోటెత్తారు. కొద్దిసేపటి క్రితం 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ రన్ ను నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, పాప్ సింగర్ స్మిత ప్రారంభించారు. ఇక 10 కిలోమీటర్ల రన్ ను ప్రారంభించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అక్కడికి చేరుకున్నారు. 10 కిలోమీటర్ల రన్ తర్వాత, 5 కిలోమీటర్ల రన్ కూడా ప్రారంభం కానుంది. మూడు రకాల మారథాన్ లో పాలుపంచుకునేందుకు నగర జనం వేలాదిగా ఇందిరాగాంధీ స్టేడియానికి తరలివచ్చారు.