: పెట్టుబడులు పోటెత్తనున్నాయి!... మరికాసేపట్లో విశాఖలో సీఐఐ సదస్సు


నవ్యాంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు పోటెత్తనున్నాయి. ఏపీ ప్రభుత్వం, భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు (పార్ట్ నర్ సమ్మిట్) పేరిట నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు మరికాసేపట్లో నవ్యాంధ్ర వాణిజ్య రాజధాని విశాఖలో ప్రారంభం కానుంది. దేశీయ పారిశ్రామిక దిగ్గజాలతో పాటు 41 దేశాలకు చెందిన దాదాపు 300 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇప్పటికే పలు పారిశ్రామిక సంస్థలు నవ్యాంధ్రలో పెట్టుబడులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. ‘గుజరాత్ వైబ్రాంట్’ పేరిట గతంలో గుజరాత్ సీఎం హోదాలో నరేంద్ర మోదీ నిర్వహించిన సదస్సు... ఆ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను రాబట్టింది. అదే తరహాలో విశాఖ సదస్సుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యూహ రచన చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న నవ్యాంధ్రకు ఈ సదస్సు కొత్త జవసత్వాలను ఇవ్వనుందన్న వాదన వినిపిస్తోంది. మూడు రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న ఈ సదస్సు కోసం ప్రభుత్వం విశాఖలో భారీ ఏర్పాట్లు చేసింది.

  • Loading...

More Telugu News