: విమానం మంటల్లో నేతాజీ కాలిపోయారు : బోస్ ఫైల్స్.ఇన్ఫో


పెద్ద శబ్దం అనంతరం విమానం కూలిపోవడంతో చెలరేగిన మంటల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాగా కాలిపోయారని నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో కలిసి ప్రయాణించిన ఆయన ముఖ్య అనుచరుడు కల్నల్ హబీబ్ ఉర్ రెహమాన్ వాంగ్మూలం ఇచ్చినట్లు బ్రిటన్ కు చెందిన బోస్ ఫైల్స్.ఇన్ఫో అనే వెబ్ సైట్ ప్రచురించింది. విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించినట్లుగా భావిస్తున్న ఆగస్టు 18,1945 రోజున అసలేం జరిగిందనే విషయమై రెహమాన్ చెప్పిన వివరాలు... ‘విమాన ప్రమాదం జరిగినప్పుడు అందులో ముందువైపు డోర్లన్నీ మూసుకుపోయాయి. నేతాజీ వెనుకవైపు మార్గమొకటే మిగిలింది. ఇక తప్పని పరిస్థితుల్లో మంటల్లో నడచుకుంటూ బయటకు వచ్చాం. నేను ధరించినవి ఉన్ని దుస్తులు కావడంతో తక్కువగా కాలగా, నేతాజీ ఖాదీ దుస్తులు ధరించడంతో ఎక్కువగా కాలిపోయాయి. నేను మంటల్లోంచి బయటకొచ్చాను. నేతాజీ కోసం చూస్తున్నాను. నేతాజీని చూస్తే ఒక మంట నడిచొస్తున్నట్లుగా ఉంది. అప్పటికే ఆయన బాగా కాలిపోయారు. నేతాజీ దగ్గరకు వెళ్లిన నేను ఆయన్ని కింద పడుకోబెట్టాను. ఆయన దుస్తులు తీసేద్దామనుకున్నాను. అప్పుడు.. గమనించాను, ఆయన తలకు బలమైన గాయమైందని’ అని రెహమాన్ వాంగ్మూలమిచ్చినట్లు ఆ వెబ్ సైట్ లో పొందుపరిచిన సమాచారంలో ఉంది. కాగా, నేతాజీ మరణానికి సంబంధించిన సమాచార పత్రాలతో పాటు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారిలో ఒకరైన నేతాజీ అనుచరుడు హబీబ్ ఉర్ రెహ్మాన్, జపనీస్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టారో కానో, సహ ప్రయాణికుడు ఉన్నారు.

  • Loading...

More Telugu News