: మహిళా ఏఈపై తోటి ఉద్యోగి దాడి!


ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని కేటీపీఎస్ లో పనిచేస్తున్న మహిళా ఏఈపై తోటి ఉద్యోగి దాడి చేశాడు. కేటీపీఎస్ ఐదో దశలోని ఆపరేషన్స్ విభాగంలో ఏఈ రవి పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అక్కడ తలెత్తిన ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో అతను విఫలమయ్యాడు. జనరల్ షిఫ్ట్ లో పనిచేస్తున్న మరో ఏఈ నాగలక్ష్మి ఈ సమస్యను పరిష్కరించింది. ఈ క్రమంలో ఆమె మనస్సు నొప్పించే విధంగా ఏఈ రవి మాట్లాడటం... ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో మహిళా ఏఈపై ఆయన వాటర్ బాటిల్ ను విసిరివేశాడు. స్వల్పంగా గాయపడ్డ నాగలక్ష్మి ఈమేరకు పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. ఏఈ రవిపై చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.

  • Loading...

More Telugu News