: సానియా జోడీ విజయకేతనం!


బ్రిస్బేన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్ లో సానియా-హింగిస్ జోడీ విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో జర్మన్ జోడీ కెర్బర్, ఆండ్రియాపై 7-5,6-1 తేడాతో సానియా జోడీ విజయం సాధించింది. హింగిస్ తో కలిసి వరుసగా 26వ విజయాన్ని సానియా సొంతం చేసుకుంది. మొదటి సెట్ లో విజయం సాధించడానికి సానియా-హింగిస్ జోడీ సుమారు 43 నిమిషాల పాటు శ్రమపడాల్సి వచ్చింది. రెండో సెట్ ను కేవలం 27 నిమిషాల్లోనే ముగించారు. కొత్త ఏడాదిలో ప్రపంచ నంబర్ వన్ జోడీ మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

  • Loading...

More Telugu News