: రాజ్యసభ సభ్యుడు వీహెచ్ కు ఫోన్ లో మహిళ బెదిరింపు
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు ఫోన్ లో ఓ మహిళ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తనను సంజనా చౌదరి అనే మహిళ బెదిరించిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు వీహెచ్ ఫిర్యాదు చేశారు. ఇందిరాగాంధీని చంపించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎందుకు మద్దతిస్తున్నారంటూ తనను బెదిరించిందని తెలిపారు. దాంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.