: పోటీని తట్టుకునేందుకే అప్పట్లో డ్రగ్స్ వాడాను: నాటి ఒలింపిక్స్ విజేత


సుమారు ముప్ఫై ఒక్క సంవత్సరాల క్రితం జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో తాను డ్రగ్స్ తీసుకుని పాల్గొన్నానని 64 సంవత్సరాల డచ్ క్రీడాకారిణి రియా స్టాల్ మెన్ పేర్కొన్నారు. నాటి ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన డిస్కస్ త్రో క్రీడాకారిణి రియా స్టాల్ మెన్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ చివరిదశలో ఉన్నప్పుడు..1984 ఒలింపిక్స్ లో తాను డ్రగ్స్ వాడానని చెప్పింది. ఉత్ప్రేరకాలు వాడుతూ గట్టి పోటీని ఇచ్చిన క్రీడాకారులను ఎదుర్కొనేందుకే తానూ డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. గాయాల నుంచి ఉపశమనం పొందేందుకు డ్రగ్స్ తప్పా వేరేమార్గం తనకు కనిపించలేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News