: కోచీ విమానాశ్రయంలో ప్రయాణికుడి నుంచి భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం
కేరళలోని కోచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కన్నూర్ కు చెందిన ఓ ప్రయాణికుడు షార్జా వెళ్లేందుకు కోచీ ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు అతను అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. అతని లగేజీనీ తనిఖీ చేయడంతో అందులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు గుర్తించారు. రూ.56 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉందని, ప్రయాణికుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.